- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడవలేక పోయినా యువతకు ఆదర్శం ఈ మహిళ
తెలంగాణలో నేడు రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేడు రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో ఓ మహిళ ఎంతమంది యువతకు స్ఫూర్తి నింపారు. సాధారణంగా యూత్ ఎన్నికల్లో ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే మెదక్ జిల్లాలోని రామాయంపేట పరిధిలోని కల్వకుంట పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్న మహిళ ఓటు వేసింది. అన్ని అవయవాల సక్రమంగా ఉండి బద్దకంతో ఓటు వేయకుండా ఉండిపోయే యువత ఆ మహిళను చూసి నేర్చుకోవాల్సి ఉందని పోలింగ్ కేంద్రంలోని అధికారులు అన్నారు.
ఆమె నడవలేక పోయినా తండ్రి భుజాలపై మోసుకుంటూ పోలింగ్ కేంద్రానికి తీసుకురాగా.. తన ఓటును వినియోగం చేసుకుంది. ఈ ఒక్క ఎన్నికల్లోనే కాదని, ప్రతి ఎన్నికల్లో ఓటు వేసి రాజ్యాంగం తనకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపింది.
READ MORE ....
ఓటు వేసి.. పోలింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన వృద్ధుడు మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘటన






