ఈ సారి కేసీఆర్ పిల్లలకు పాలపీకా, డైపర్లు అందిస్తాం.. కాంగ్రెస్ నేత ఫహీం హాట్ కామెంట్స్

by Ramesh Goud |   (  Updated:2025-04-29 08:59:37  IST  )

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) పిల్లలు అసెంబ్లీకి వస్తే పాలపీకా, డైపర్లు అందిస్తామని తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఫహీం (Telangana Food Corporation Chairman Phaheem) ఎద్దేవా చేశారు.

ఈ సారి కేసీఆర్ పిల్లలకు పాలపీకా, డైపర్లు అందిస్తాం.. కాంగ్రెస్ నేత ఫహీం హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) పిల్లలు అసెంబ్లీకి వస్తే పాలపీకా, డైపర్లు అందిస్తామని తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఫహీం (Telangana Food Corporation Chairman Phaheem) ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting)లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తనను అసెంబ్లీకి రావాలని అడుగుతున్నారని, మా పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నారు.. నేనెందుకు? అని వ్యాఖ్యానించారు.

దీనిపై కాంగ్రెస్ నేత ఫహీం స్పందిస్తూ.. బీఆర్ఎస్ నేతల (BRS Leaders)కు కౌంటర్ (Conter) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్ (Gandi Bhavan) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీకి నేను రావాలా.. నా పిల్లలను పంపిస్తా అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, గత రెండు మూడు అసెంబ్లీ సెషన్లలో మాట్లాడటానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిలబడితేనే మీ పిల్లలకు తడిచిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అందుకే ఈ సారి అసెంబ్లీ సెషన్ (Assembly Session) కు మీ పిల్లలు ఎవరు వస్తారో లిస్ట్ ఇస్తే.. ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ గా బూస్ట్, హార్లిక్స్ ఇస్తామని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working PresidentKTR) గురించి ప్రత్యేకంగా పాలపీకా, సెరెలాక్, డైపర్లు అందిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కేసీఆర్ పిల్లలు కేటీఆర్, హరీష్ రావు (Harish Rao) మాత్రమేనా ఇంకా ఎవరు ఉన్నారో జాబితా పంపిస్తే వారికి ఫుడ్ కార్పోరేషన్ తరుఫున ఈ వస్తువులు ఇస్తామని కాంగ్రెస్ నేత అన్నారు.

Next Story