ఈ పోరాటం ఒక్క తెలంగాణదే కాదు.. భారతీయులందరిది : రాహుల్ గాంధీ

by Muthe.Rajitha |

బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై పార్లమెంటు చట్టబద్దత చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ పోరాటం ఒక్క తెలంగాణదే కాదు.. భారతీయులందరిది : రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై పార్లమెంటు చట్టబద్దత చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసన సభపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్వీట్ చేసారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ యుద్ధం కేవలం తెలంగాణది మాత్రమే కాదని, యావత్ భారతీయులదని పేర్కొన్నారు. అణగారిన వర్గాల్లోని ప్రతి భారతీయుడికీ అధికారంలో, భాగస్వామ్యంలో, పురోగతి కోసం జరుగుతున్న యుద్ధం అన్నారు.

రాష్ట్రపతి బీసీ రిజర్వేషన్ బిల్లును పరిశీలించి ఆమోదిస్తారని ఆశిస్తున్నట్టు రాహుల్ ఆకాంక్షించారు. బీసీ రిజర్వేషన్ల చట్టం సామజిక న్యాయానికి నాంది పలుకుతుందని, దానిని సాధించడం కోసమే కాంగ్రెస్ ఈ భారీ నిరసన చేపట్టిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Next Story