- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విషయంలో పునరాలోచన చేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచన
వారిని మాతృ భాషకు దూరం చేడం మంచిది కాదని, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: వారిని మాతృ భాషకు దూరం చేడం మంచిది కాదని, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) అన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్య (Intermediat Study) స్థాయిలో సంస్కృతం (Sanskrit) రెండో భాష (Second Language)గా చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదని విసృతంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వెంకయ్య నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Governemnt) భావిస్తోందన్న వార్తలు విని విచారించానని అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచించారు. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని చెప్పారు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుందని వివరించారు. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 (National Education Polocy- 2020) సైతం మాతృభాష (Mother Language)కు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.






