కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టేది కేవలం అందుకే..! కాంగ్రెస్ ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి అన్నీ జోకర్ ముచ్చట్లు అని, ప్రభుత్వాన్ని నిందించిందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నారని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) విమర్శించారు.

కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టేది కేవలం అందుకే..! కాంగ్రెస్ ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వి అన్నీ జోకర్ ముచ్చట్లు అని, ప్రభుత్వాన్ని నిందించిందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నారని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో మీడియా సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చామల.. మాజీమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కేటీఆర్ కి నిద్ర పట్టి ఉండకపోవచ్చని, రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఎలాంటి వ్యాఖ్యలు చేద్దామా? అని చెప్పి రాత్రంతా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాడని ఎద్దేవా చేశారు.

ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని నిందిద్దామా అన్న ఆరాటంతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు అని అన్నారు. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారని సగం సగం నాలెజ్డ్ తో మాట్లాడారని, రాను రాను కేటీఆర్ ప్రెస్ మీట్లు హాస్యాస్పదం అయిపోయాయని అన్నారు. ఆయన కేవలం రేవంత్ రెడ్డిని, ఆయన సర్కార్ ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నారని ప్రజలకు కూడా అర్థమై పోయిందన్నారు. అలాగే ప్రెస్ మీట్లలో వాస్తవాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఆలోచన తప్ప ఇంకేం కనిపించడం లేదని అన్నారు.

సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలు సమర్పించిందని, దీంతో కోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయ్యిందని చెప్పే ప్రయత్నం చేశారని, కానీ కమిటీ నివేదిక పై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పూర్తి నివేదిక సమర్పించడానికి మరో నాలుగు వారాలు సమయం కోరిందని తెలిపారు. కేవలం కంచ గచ్చిబౌలి భూములపై మీరు పెట్టిన ఏఐ చిత్రాలు, ఫేక్ వీడియోల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కేటీఆర్ గ్రహించాలని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెబుతూ.. ముఖ్యమంత్రిపై ఉన్న విశ్వాసాన్ని ప్రజల నుంచి దూరం చేయాలన్న పిచ్చి ప్రయత్నాన్ని మానుకోవాలని చామల సూచించారు.

Next Story