ఆయన మోడీకి ధన్యవాదాలు చెప్పింది ఇందుకే..! కేటీఆర్ ట్వీట్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

by Ramesh Goud |

కేటీఆర్ ప్రధానికి ధన్యవాదాలు చెప్పింది ఈ అంశాలపైనే అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Bhivanagiri MP Chamala Kiran Kumar Reddy) అన్నారు.

ఆయన మోడీకి ధన్యవాదాలు చెప్పింది ఇందుకే..! కేటీఆర్ ట్వీట్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ ప్రధానికి ధన్యవాదాలు చెప్పింది ఈ అంశాలపైనే అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Bhivanagiri MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. తెలంగాణలో వివాదంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల అంశం (Kancha Gachibouli Lands Dispute)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ట్వీట్ చేస్తూ.. నరేంద్ర మోడీని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ.. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా చామల.. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)కి కంచ గచ్చిబౌలి కంచ భూముల విషయంలో ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారని అన్నారు.

ఎందుకంటే..!, ఐటీ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నందుకు.. తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగాలను అడ్డుకున్నందుకు.. తాను క్రియేట్ చేయించిన AI ఫేక్ వీడియోలను నమ్మినందుకు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు నిధులు రాకుండా అడ్డుకున్నందుకు.. నిధులు పుష్కలంగా వస్తే ప్రజా సంక్షేమ ఇనుమడించి, రేవంత్ సర్కారుకు మంచి పేరు వస్తుందని, అది రాకుండా అడ్డుకున్నందుకు.. ఓవరాల్ గా తెలంగాణలో రేవంత్ సర్కారు కాళ్లల్లో కట్టె పెట్టడంలో తమతో కలిసి వచ్చినందుకు మోడీకి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారని చామల కిరణ్ ఎద్దేవా చేశారు.

Next Story