H-1B వీసా ఫీజుల పెంపు.. ప్రభుత్వ వైఫల్యమంటూ హరీష్ రావు ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-22 04:38:08  IST  )

అమెరికా H-1B వీసా ఫీజు, ఇటీవల భారత్ పై 25 శాతం టారిఫ్ ను పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.

H-1B వీసా ఫీజుల పెంపు.. ప్రభుత్వ వైఫల్యమంటూ హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా H-1B వీసా ఫీజు, ఇటీవల భారత్ పై 25 శాతం టారిఫ్ ను పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) స్పందించారు. ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఫల్యాన్ని ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంటూ.. ఎక్స్ (X)లో పోస్ట్ చేశారు. అమెరికా తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల లక్షలాది కుటుంబాలు, వేలాది పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. అమెరికాలో చదువుతున్న లక్షలాది భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇతర పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో అవసరమైన చర్చలు జరిపి.. వీటికి సరైన పరిష్కార మార్గాలను చూపాలంటూ మంత్రి జైశంకర్ ను కోరారు.

కాగా.. హెచ్1బీ వీసా ఫీజు (H1B Visa Fee) కొత్తగా వీసాకు అప్లై చేసుకునేవారికి వర్తిస్తుందని వైట్ హౌస్ (White House) స్పష్టం చేసింది. ఇప్పటికే వీసాలు ఉన్నవారు ఎప్పుడైనా అమెరికాకు తిరిగి రావొచ్చునని, వీసా రెన్యువల్ కు కూడా ఈ ఫీజు వర్తిస్తుందన్న భయం వద్దని తెలిపింది.

Next Story