ఈ రోజు ‘గూగుల్ డూడుల్’ ప్రత్యేకత ఇదే..!

by Disha Web Desk 4 |
ఈ రోజు ‘గూగుల్ డూడుల్’ ప్రత్యేకత ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో దేని గురించి తెలుసుకోవాలన్న గూగుల్ చేయాల్సిందే. ఉపాధి, ఆటలు, ఎంటర్‌టైన్‌మెంట్, వార్తలు, ఇతర సమాచారం, మ్యాపింగ్ కోసం కోట్ల మంది గూగుల్‌పై ఆధారపడుతున్నారు. ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే వీకిపీడియా చదివేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో కొన్ని బుక్స్ సైతం ఉంటున్నాయి. అయితే సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ రోజు ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను ఉంచింది.

గూగుల్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా G25gle అనే డూడుల్‌ను సెట్ చేసింది. 1998 సెప్టెంబర్ 27న అధికారికంగా గూగుల్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా గూగుల్ ఓ సందేశాన్ని తెలిపింది. గూగుల్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ డూడుల్ చేంజ్ అయిన సంకల్పం మాత్రం మారలేదని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మందికి సమాచారం అందించడంలో తమ పంథా అలానే కొనసాగుతుందని తెలిపింది.

Read More Latest updates of Andhra Pradesh News

Next Story

Most Viewed