ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. రీకౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-16 09:56:23  IST  )

తెలంగాణ (Telangana) ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు(Inter supplementary results) ఈ రోజు(జూన్ 16) విడుదలైన విషయం తెలిసిందే.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. రీకౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు(Inter supplementary results) ఈ రోజు(జూన్ 16) విడుదలైన విషయం తెలిసిందే. గత నెల(మే) 22 తేదీ నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఫస్టియర్‌లో 67.4, సెకండియర్‌లో 50.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 61.75శాతం మంది, బాలికలు 73.88శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల(జూన్) 17 నుంచి 23వ తేదీ వరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌ సైట్ https://tgbie.cgg.gov.in లో రీకౌంటింగ్, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ అండ్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రీకౌంటింగ్‌కు పేపర్‌కు 100, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ అండ్ వెరిఫికేషన్ కోసం పేపర్‌కు రూ.600 చెల్లించాలి.

Next Story