- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయులున్న నౌకపై దాడి.. తీవ్రంగా స్పందించిన మోడీ సర్కార్
by velandi.Saikiran |
పలావు జెండాతో బయలుదేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

X
దిశ, వెబ్ డెస్క్: హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న మరో నౌకపై బుధవారం దాడి చోటు చేసుకుంది. పలావు జెండాతో బయలుదేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక చీఫ్ జేసన్ మీక్స్ కు నోటీసులు కూడా జారీ చేసింది. కాగా తమ ఆదేశాలను పాటించడంలో షిప్ విఫలం కావడంతో క్షిపణి దాడి జరిగినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. పలావు జెండాతో వెళ్తున్న ఆ నౌకలో ఏకంగా 21 మందిని రక్షించగా... ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇక ఆ ముగ్గురిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
Next Story






