- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటరి మహిళతో సహజీవనం..అంతలోనే అదిరిపోయే ట్విస్ట్
వివాహం చేసుకుంటానని మోసం చేసి.. నగదు, బంగారం తీసుకుని ఓ వ్యక్తి పారిపోయాడంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

దిశ, మేడిపల్లి : వివాహం చేసుకుంటానని మోసం చేసి.. నగదు, బంగారం తీసుకుని ఓ వ్యక్తి పారిపోయాడంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, బోడుప్పల్ లోని ఉదయ్ నగర్ కు చెందిన సిస్టు వెంకట భారతి, భర్తకు దూరంగా ఉంటూ, ఒంటరి జీవితం గడుపుతోంది. ఈ తరుణంలోనే 2019లో ఫేస్ బుక్ ద్వారా షేక్ మహబూబ్ హుస్సేన్ తో భారతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహ జీవనానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బోడుప్పల్‌లో ఆమెతో కలిసి జీవించాడు హుస్సేన్. ఈ క్రమంలోనే తాజాగా రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని పారిపోయాడని భారతి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన మేడిపల్లి పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హుస్సేన్ ప్రస్తుతం మరో అమ్మాయితో ఉంటున్నాడని సమాచారం.






