Sarpanch elections: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్థానం ఇదే..!

by Ramesh Naini |   (  Updated:2025-12-11 12:24:26  IST  )

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.

Sarpanch elections: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్థానం ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇవాళ తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మొదటి విడతలో మొత్తం 4,231 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ఇప్పటి వరకు కాంగ్రెస్‌ బలపర్చిన 534 మంది సర్పంచ్‌ అభ్యర్థులు గెలుపొందినట్లు అధికారుల సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్‌ బలపర్చిన 167 సర్పంచ్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే కాస్త నిరాశే మిగిలింది. బీజేపీ బలపర్చిన 21 మంది సర్పంచ్‌ అభ్యర్థుల విజయం సాధించారు. మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉప సర్పంచ్ అభ్యర్థిని సైతం నేడే ఖరారు చేస్తారు.

Next Story