- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి సాక్ష్యం ఇదే.. హరీష్ రావు సంచలన ట్వీట్
బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇదే సాక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లను ఉద్దేశించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇదే సాక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లను ఉద్దేశించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఆరోపించారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి (Telangana Planning Commission Vice Chairman Chinna Reddy) మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Governmet)పై సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Mahabubnagar local body MLC elections) కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి (Congress candidate Jeevan Reddy) చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేసారని తెలిపారు. ఈడీలు (ED), సీబీఐలు (CBI), ఐటీలు (IT), ఎన్నికల కమిషన్లు (Election Commissions) ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? అని, సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు.
అలాగే బీఆర్ఎస్ నాయకుల (BRS Leaders)పై నిరాధారమైన కేసులు పెట్టడంలో చూపించే అత్యుత్సాహం.. ఆధారాలున్నా, స్వయంగా క్యాబినెట్ ర్యాంకు (cabinet rank)లో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే (Congress Leader) చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదు? అని నిలదీశారు. ఇక కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన (public governance), రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? అని దుయ్యబట్టారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? అని అడిగారు. అంతేగాక బడే భాయ్ (Bade Bhai), ఛోటే భాయ్ (Chhote Bhai) బంధానికి ఇంతకంటే సాక్ష్యం (evidence) ఏం కావాలి? అంటూ.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని అన్నారు. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ (BRS Party) పక్షాన డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు.






