- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eravathri Anil : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే ఇది సాధ్యం : ఈరవత్రిఅనిల్
బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి దర్శనం సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కరువైన రోజుల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలిసే రోజులు కాంగ్రెస్ పాలనలో వచ్చాయని ఇది కదా మార్పు..ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం(Congress-led Government)లోనే సాధ్యమని సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ చైర్మన్ ఈరవత్రి అనిల్(Eravathri Anil) పేర్కొన్నారు

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి దర్శనం సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కరువైన రోజుల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలిసే రోజులు కాంగ్రెస్ పాలనలో వచ్చాయని ఇది కదా మార్పు..ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం(Congress-led Government)లోనే సాధ్యమని సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ చైర్మన్ ఈరవత్రి అనిల్(Eravathri Anil) పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారి నియోజకవర్గ సమస్యలను వివరిస్తు్న్న ఫోటోను అనిల్ ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడం..ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం గత పదేళ్లలో ఇప్పుడే చూస్తున్నామని తన ట్వీట్ లో అనిల్ గుర్తు చేశారు. ఇది కుటుంబ పార్టీ కాదని..ఇది ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాదని..ఇది కాంగ్రెస్ గొప్పతనం..ఇది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటూ అనిల్ తన ట్వీట్ లో పేర్కోన్నారు.






