ఇది కాంగ్రెస్ కాదు.. స్కామ్‌గ్రెస్..! కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-30 05:53:45  IST  )

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంచలన సవాల్ విసిరారు.

ఇది కాంగ్రెస్ కాదు.. స్కామ్‌గ్రెస్..! కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉందని.. అక్కడ మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముందుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిహార్‌ ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలు ఇచ్చే ముందు, తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆ హామీని నెరవేర్చి చూపించాలని ప్రశాంత్ కిషోర్ ఝలక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వీడియోను ట్యాగ్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌కు అర్థం చెబుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌కు C అంటే కాంగ్రెస్.. C అంటే చీటింగ్.. C అంటే చోరీ అందుకే వాళ్లకు తెలిసిన ఏకైక సంఖ్య 420! అంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే ప్రతి మహిళా ఓటరుకు నెలకు రూ.2,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవేమని అన్నారు. తెలంగాణలో 1.67 కోట్ల మహిళలు గత 600 రోజులకు‌పైగా ఆర్థిక సాయం కోసం వేచి చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ, రేవంత్ సర్కార్ ఇచ్చింది పెద్ద సున్నా! అంటూ ధ్వజమెత్తారు. రూ.500 గ్యాస్ సిలిండర్లు, ఒక తులం బంగారం, టూ‌ వీలర్లు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక మహిళలు కోటీశ్వరులవుతారని చెప్పారని.. కానీ వారు నేటికీ పేదరికంలోనే మగ్గుతున్నాని కామెంట్ చేశారు. నిరుపేదలను ఇళ్లను సైతం బుల్డోజర్లతో నిర్ధాక్షిణ్యంగా కూల్చేసి వారి జీవనోపాధిని లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్‌కు వోటు చోరీ. ఓట్ల కోసం ఆకాశానికి నిచ్చెన వేసేలా హామీ ఇచ్చారని.. కానీ ఎప్పటికీ నెరవేర్చరని అన్నారు. ఇది కాంగ్రెస్ కాదు.. స్కామ్‌గ్రెస్! ఒక ఓటు విలువ ఐదేళ్లు.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read..

కాళేశ్వరంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Next Story