ఇది పొత్తు కాదు.. బానిసత్వం.. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ సంచలన ట్వీట్

by Ramesh Goud |

ఇది పొత్తు కాదు.. బానిసత్వం అని హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీని ఉద్దేశించి బీజేపీ తెలంగాణ (BJP Telangana) ట్వీట్ చేసింది.

ఇది పొత్తు కాదు.. బానిసత్వం.. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇది పొత్తు కాదు.. బానిసత్వం అని హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీని ఉద్దేశించి బీజేపీ తెలంగాణ (BJP Telangana) ట్వీట్ చేసింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Hyderabad MLC Elections) బీజేపీ (BJP), ఏఐఎంఐఎం (AIMIM) పోటీల్లో నిలిచాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ (Congress) మద్దతు తెలుపుతూ.. పోటీ నుంచి తప్పుకుంది. దీనిపై బీజేపీ తెలంగాణ స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. మన పూర్వీకుల ప్రాణాలు తీసిన కసాయిదారులకు సెల్యూట్ చేయడం ద్రోహం అని, మన మూలాలను నరికి పాతరవేసిన వారి కాళ్ళ ముందు మోకరిల్లడం పిరికితనం అని హాట్ కామెంట్స్ చేసింది. అలాగే బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ ఎప్పుడో ఏఐఎంఐఎం కి తలవంచాయని, హైదరాబాద్‌ను వాళ్ళకు సమర్పించాయని తెలిపింది.

అంతేగాక మన ఆత్మాభిమానాన్ని, గర్వాన్ని పాతిపెట్టాయని, ఎదురించే దమ్ము లేక వెన్నెముకను వాళ్ళ మెడలో హారంలా వేసాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు, తమ ఓటమిని అంగీకరించి.. ఎమ్మెల్సీ ఎన్నికలను ఒవైసీ (Owisi)కి వదిలేసారని, ఏఐఎంఐఎం అభ్యర్థికి పూర్తి మద్దతు తెలిపి ఎమ్మెల్సీ పదవిని వెండి పళ్ళెంలో ఒవైసీ సోదరులకు బహుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టింది. ఇక ఇది పొత్తు కాదు, ఇది బానిసత్వం అంటూ.. ఏఐఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు కలిసి వచ్చినా, వెనకకి తగ్గేది లేదని స్పష్టం చేసింది. బీజేపీ ఈ ముగ్గురిని ఒంటి చేత్తో ఎదురుకుంటుంది అని, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.గౌతమ్ రావు (N.Gowtham Rao) ఈ కూటమితో పోరాడతారని తెలిపింది. ఇది ఒక సీటు.. ఎన్నికల విషయం కాదని, తెలంగాణ గర్వం, ఆత్మగౌరవం కోసమని బీజేపీ తెలంగాణ రాసుకొచ్చింది.

Next Story