ఇది శాపం కాదు.. కాంగ్రెస్ పెట్టిన శఠగోపం.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన విమర్శలు

by Ramesh Goud |

నాటి కేసీఆర్ పాలనలో జలకల ఉంటే నేటి కాంగ్రెస్ పాలనలో విలవిల ఉన్నదని, కాంగ్రెస్ అంటే కరువు.. కరువు అంటే కాంగ్రెస్! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విమర్శించారు.

ఇది శాపం కాదు.. కాంగ్రెస్ పెట్టిన శఠగోపం.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: నాటి కేసీఆర్ పాలనలో జలకల ఉంటే నేటి కాంగ్రెస్ పాలనలో విలవిల ఉన్నదని, కాంగ్రెస్ అంటే కరువు.. కరువు అంటే కాంగ్రెస్! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విమర్శించారు. ప్రాజెక్టులలో నీటి నిల్వలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. కక్షతో కాళేశ్వరం పంపు (Kaleshwaram Pumps)లను పడావుపెట్టి, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల (Palamuru Rangareddy Lift Irrigation) పనులను పక్కనపెట్టి, గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేసిన ఫలితం ఇలాగే ఉంటుందని అన్నారు.

సాగునీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని, . తాగునీళ్లు లేక గొంతులు తడారుతున్నాయని తెలిపారు. పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపోయిందని, తలాపునా గోదారి పారుతున్నా మన సేను, మన సెలుక ఎడారి అవుతున్నాయని అన్నారు. నాడు కేసీఆర్ పాలన (KCR Governance)లో జలకళ.. నేడు అసమర్థ కాంగ్రెస్ పాలన (Congress Governance)లో విలవిల అని దుయ్యబట్టారు. నాడు ఇంటింటికి నల్లానీళ్లు.. నేడు ఆడబిడ్డల కండ్లల్లో కన్నీళ్లు అంటూ.. ఇది శ్రీశైలం, సాగర్ జలాశయాలను ఏపీ సర్కారు (AP Government) ఖాళీ చేస్తున్నా నోరెత్తని కాంగ్రెస్ సర్కారు తప్పిదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ మీద కక్షతో రిజర్వాయర్లను, చెరువులు, కుంటలు నింపని కాంగ్రెస్ పాపమని ఫైర్ అయ్యారు. ఇక ఇది కాలం పెట్టిన శాపం కాదు.. తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన శఠగోపం అని మాజీమంత్రి వ్యాఖ్యానించారు.

Next Story