- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదీ ఆరంభం మాత్రమే.. ఈనెల 20 నుంచి 22 వరకు నేషనల్ యూత్బయోడైవర్సీ కాన్ఫరెన్స్
తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా నేషనల్యూత్బయోడైవర్సీ కాన్ఫరెన్స్నిర్వహిస్తున్నామని తెలంగాణ బయోడైవర్సీ బోర్డుసభ్యులు కాళీఛరణ్ ఖార్తాడే తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా నేషనల్యూత్బయోడైవర్సీ కాన్ఫరెన్స్నిర్వహిస్తున్నామని తెలంగాణ బయోడైవర్సీ బోర్డుసభ్యులు కాళీఛరణ్ ఖార్తాడే తెలిపారు. అటవీ శాఖ అరణ్యభవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవ వైవిధ్య పరిరక్షణకు యువతకు సాధికారిత కల్పించేందుకు నేషనల్యూత్బయోడైవర్సీ కాన్ఫరెన్స్నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో ఈ కాన్ఫరెన్స్నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజులపాటు జరిగే జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై కీలక ప్రసంగాలు, ప్యానెల్, చర్చలు, వర్క్‌షాప్‌లు, ఆచరణత్మక టైనింగ్ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా జీవ వైవిధ్య నీతి, పర్యావరణ ఉగ్రవాదం, డిజిటల్సీక్వెన్స్సమాచారం, స్వదేశీ సమాజాల పాత్రలపై వర్క్‌షాపు నిర్వహించనున్నామని ఆయన అన్నారు. కార్యక్రమానికి ఫస్ట్‌డే ఛీప్‌గెస్ట్‌గా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, చివరి రోజు తెలంగాణ గవర్నర్హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణ, స్థిరమైన వనరుల నిర్వహణ, చట్టపరమైన, స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను కవర్‌చేసేలా విభిన్న ఎజెండాతో ముందుకెళ్తున్నామన్నారు. కున్మింగ్–మాంట్రియల్గ్లోబల్బయోడైవర్సీ ఫ్రేమ్వర్క్స్వంటి ప్రపంచ సమావేశాల కింద భారత్నిబద్ధతలను బలోపేతానికి లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా జీవ వైవిధ్యంలో యువ నాయకులను బయటకు తీసుకురానుందన్నారు.
దేశంలోని ఉన్న రాష్ట్రాలతోపాటు యూటీలను ఇద్దరేసి పీజీ స్టూడెంట్స్ ఈ కాన్ఫరెన్స్‌లో భాగస్వాములు అవుతున్నారని కాళీఛరణ్ ఖార్తాడే చెప్పారు. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 650 మంది స్టూడెంట్స్ నుంచి దరఖాస్తులు అందాయని, అందులోంచి షార్ట్లీస్టు చేశామని, మొత్తంగా 70 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పర్యావరణ నాయకుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యార్థి ప్రతినిధులను ఒక చోట చేర్చి కీలకమైన పర్యావరణ సవాళ్లు, పరిష్కారాలను చర్చించే అవకాశముందన్నారు. అలాగే, తెలంగాణలోని ఆదిలాబాద్జిల్లాలోని గిరిజను ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కాన్ఫరెన్స్‌కు నేషనల్ బయోడైవర్సీ ఆథరిటీ చైర్పర్సన్అచలేందర్రెడ్డి, పంజాబ్బయోడైవర్సీ సెక్రటరీ మెంబర్నీలిమా, పద్మశ్రీ అవార్డు గ్రహీత రహిబాయిసోమ, డబ్ల్యూడబ్ల్యూ ఇండియా స్టేట్ డైరెక్టర్ఫరిదా, రిటైర్డ్ఐఎఫ్ఎస్ఎకె.గోయల్, ఎన్బీఏ చైర్పర్సన్మాథూర్, డబ్ల్యూఏటీఓం యోగితా, యూత్లీడర్స్మీనాల్, హేమవతి, శంకర్‌లు విచ్చేస్తున్నారని తెలిపారు. అయితే, ఈ కాన్ఫరెన్స్ద్వారా హైదరాబాద్డిక్లనరేషన్పేరిట ఒక డ్యాకుమెంటరీ తయారు చేయనున్నామన్నారు. ఇదీ ఆరంభం మాత్రమేనని, ప్రతి ఏటా నేషనల్యూత్బయోడైవర్సీ కాన్ఫరెన్స్ నిర్వహిణకు ఇదీ ఒక వేదిక కానుందని ఈ సందర్భంగా కాళీచరణ్ఖర్తాడే వివరించారు.






