- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : ఇది ఇందిరమ్మ రాజ్యమా..ఎమర్జెన్సీ పాలనా ? : కేటీఆర్
రాష్ట్రంలో ఉన్నది.. ఇందిరమ్మ రాజ్యమాIndiramma's kingdom)..ఎమర్జెన్సీ పాలనా(Emergency rule)? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఉన్నది.. ఇందిరమ్మ రాజ్యమాIndiramma's kingdom)..ఎమర్జెన్సీ పాలనా(Emergency rule)? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కూల్చివేతలు(Demolitions)..కాల్చివేతలు..అణచివేతలు(Oppressions)..ఆక్రమణలు..అరెస్టు(Arrests)లు..జైళ్లు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని విమర్శించారు. నిర్భంధం..నియంతృత్వం..పేదల వేదల అరణ్య రోదన కొనసాగుతోందని..కట్టుకున్న గూడు..కండ్ల ముందే కూలితే..రెక్కల కష్టం..రెప్పపాటులో ఒరిగిపోతే..కంటికిరెప్పలా..కాపాడాల్సిన సర్కారు..కాళ్ల కింద కర్కశంగా నలిపేస్తుంటే..ఇది ప్రజాపాలన అంటారా ?
ప్రతీకార పాలన అంటారా ? అని కేటీఆర్ నిలదీశారు. దీనిని ఇందిరమ్మ రాజ్యమంటారా..ఎమర్జెన్సీ పాలనా అంటారా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ(Charakonda)లో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై 29ఇండ్లను కూల్చివేసిన ఘటనలో బాధితుల గోడు వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు. అక్కడ నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లు కూల్చివేశారని బాధితులు..జీవో జారీ చేశాకే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. చారకొండలో ఇల్లు కూల్చేస్తుంటే వృద్ధ దంపతులు తమకు ఉన్న గూడు కూల్చేస్తే ఎలా బ్రతకాలంటూ పోలీసులను వేడుకుంటూ రోధించారు. వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోగా ఆసుపత్రికి తరలించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం సహా పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగిస్తుండటాన్ని బీఆర్ఎస్ మెుదటి నుంచి వ్యతిరేస్తుంది. అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా జరిగే కూల్చివేతలను కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించి బాధితులతో కలిసి నిరసనలకు దిగింది. ఈ క్రమంలో సీఎం సొంత జిల్లాలో కూల్చివేతలను కూడా బీఆర్ఎస్ వ్యతిరేంచింది. అయితే చారకొండలో 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే బైపాస్ కోసం భూసేకరణ కోసం సర్వే చేశారని..అప్పుడే నిర్వాసితులకు నష్టపరిహారం కూడా ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తుండటంతో ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర విమర్శల అంశంగా మారింది.






