- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది దుర్మార్గం, క్రిమినల్ నెగ్లిజెన్స్.. సీఎంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
రాష్ట్రంలో భారీ కురుస్తున్న నేపథ్యంలోనే బురద రాజకీయాలు మాని.. వరద బాధితులను ఆరుకోవాలని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ కురుస్తున్న నేపథ్యంలోనే బురద రాజకీయాలు మాని.. వరద బాధితులను ఆరుకోవాలని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి పాలన నిర్లక్ష్యం వల్లే ఇవాళ హైదరాబాద్ (Hyderabad) జల దిగ్బంధంలో చిక్కుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తుగా చెప్పినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదన్నారు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదని, ఇది దుర్మార్గమని, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని ఆరోపించారు.
వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రణాళికలు వేయడంలో వైఫల్యం, ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం.. వెరసి జల దిగ్బంధంలో హైదరాబాద్ అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పండగ వేళ సొంతూళ్లకు వెళ్లలేక, భయంభయంగా రాత్రి నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి అంటూ సెటైర్లు వేశారు. మూసీ (Musi) నది పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని.. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పంచాలన్నారు. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని హరీశ్ రావు ట్వీట్ చేశారు.






