- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంకర్ స్వేచ్ఛ చివరి ఇన్‌స్టా పోస్టు ఇదే.. దాని వెనుక ఉన్న అర్థం ఏంటి?
తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (Swetcha Votarkar) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (Swetcha Votarkar) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆమె హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన యావత్ తెలుగు మీడియా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఎంతో ధైర్యవంతురాలైన స్వేచ్ఛ ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? అంటూ ఆమె మృతిపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వేచ్ఛ చివరి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.
స్వేచ్ఛ చివరగా.. ధ్యానం చేసే ఫొటోతో పాటు పలు ఫొటోలను షేర్ చేస్తూ 'Quiet the mind and the soul will speak'అని బుద్ధుడి కోట్‌ను క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. 'మన మనసు ఎప్పుడూ ఆలోచనలతో, భయాలతో, ఆశలతో, సంఘర్షణలతో నిండిపోయి ఉంటుంది. అలాంటి అల్లకల్లోలమైన మనసుతో మన నిజమైన భావాలు మన అంతరాత్మకు కనిపించవు. కానీ మనసు ఆ ఆలోచనల అలజడిని నియంత్రిస్తే.. మన అసలైన భావాల తాలుకు శబ్ధం మన లోపల వినిపిస్తుంది.' అని దాని అర్థం. ఈ పోస్ట్ ఆమె మానసిక స్థితిని ప్రతిబింబిస్తోంది. సాధారణంగా ఇలాంటి కోట్స్ మానసిక ప్రశాంతత కోరుకునే వారు ఎంచుకుంటారు. అంటే, స్వేచ్ఛ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చ లేకపోవడం, ముఖ్యంగా ప్రజా దృష్టిలో ఉన్న వ్యక్తులపై ఇది మరింత తీవ్రంగా ఉండటంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.
బయటి ప్రపంచానికి ఆమె ధైర్యం, నిజాయితీతో ప్రశ్నించే స్వభావం బలంగా చూపించినా, లోపల ఆమె ఎంతటి బాధలో ఉన్నారో ఎవరికీ తెలియలేదు. అందుకే మానసిక ఆరోగ్యంపై బహిరంగంగా మాట్లాడాల్సిన విషయం అని, దాచుకునే విషయం కాదని ఈ ఘటన మరోసారి మనకు గుర్తుచేస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న వారు బయటకు నవ్వుతూ కనిపించినా, లోపల ఒక పెద్ద ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో మద్దతు అవసరం, అవగాహన అవసరం.
Read More..
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. సంచలనం రేపుతున్న దర్శకుడి పోస్ట్..
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. తండ్రి సంచలన ఆరోపణలు






