న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. సంచలనం రేపుతున్న దర్శకుడి పోస్ట్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-28 09:58:56  IST  )

ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. తన బిడ్డ సూసైడ్ చేసుకునేందుకు కారణం సహజీవనం చేస్తున్న వ్యక్తి పూర్ణ చంద్రరావు అని తండ్రి ఆరోపిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. సంచలనం రేపుతున్న దర్శకుడి పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. తన బిడ్డ సూసైడ్ చేసుకునేందుకు కారణం సహజీవనం చేస్తున్న వ్యక్తి పూర్ణ చందర్ అని తండ్రి ఆరోపిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో ఒకే ఇంట్లో ఉంటున్న ఆయన.. మ్యారేజ్ విషయం తెచ్చేసరికి గొడవ పడ్డాడని, మనస్తాపంతో చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా పోలీసులు తల్లిదండ్రులు, కూతురు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. పూర్ణ చందర్‌ను అదుపులోకి తీసుకోనున్నారు.

ఇకఆమె మరణాన్నిఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఫ్రెండ్స్, కొలిగ్స్ చెప్తుండగా.. డైరెక్టర్ వేణు ఊడుగుల కూడా తనకు పర్సనల్ లాస్ అంటూ పోస్ట్ పెట్టాడు. ‘జర్నలిస్ట్, రైటర్, యాక్టివిస్ట్, నా తోటి కవి ఇక లేరు. తన జీవితాన్ని ముగించడాన్నే ఎంచుకుంది. నాకు చాలా పెద్ద పర్సనల్ లాస్. తెలుగు రాష్ట్రాలు సిన్సియర్, ప్రిన్సపుల్డ్ వాయిస్‌ను కోల్పోయాయి. మై సైలెంట్ ట్రిబ్యూట్’ అని సంతాపం ప్రకటిస్తూ పోస్ట్ పెట్టాడు. కాగా ఆమె చనిపోయేందుకు కారణం ఏదైనా ఉంటే చెప్పాలని కోరుతున్నారు నెటిజన్లు.

LINK

Next Story