రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఈ ఫెలోషిప్ కార్యక్రమం ఒక గొప్ప అవకాశం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు.

రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఈ ఫెలోషిప్ కార్యక్రమం ఒక గొప్ప అవకాశం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. గాంధీ భవన్ (Gandhi Bhavan)లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (All India Professional Congress) ఆధ్వర్యంలో నిర్వహించనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలో షిప్ కార్యక్రమానికి (Dr. Manmohan Singh Fellowship Programe) సంబంధించిన కర పత్రాన్ని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఫెలో షిప్ కార్యక్రమం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వారు బృహత్తర కార్యక్రమమైన ఫెలో షిప్ ను లాంచ్ చేయడం శుభ పరిణామం అని అన్నారు. అలాగే ప్రొఫెషనల్ గా స్థిరపడిన తర్వాత రాజకీయాల్లో రావాలనుకునే వారికి ఫెలోషిప్ కార్యక్రమం ఓ మంచి అవకాశంగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (Former PM PV Narsimha Rao) ప్రోద్బలంతోనే మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇక టీపీసీసీ తరఫున డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలో షిప్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకుల్ని టీపీసీసీ చీఫ్ అభినందించారు.

Next Story