నో ప్లాస్టిక్... తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రత్యేక కిట్స్.. వివరాలు ఇవే!

by velandi.Saikiran |

తెలంగాణ ( Telangana) రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ( Telangana )రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ను

నో ప్లాస్టిక్... తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రత్యేక కిట్స్.. వివరాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ( Telangana) రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ( Telangana )రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ను ( Plastic ) నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ( Revanth Reddy Sarkar ). ఇందులో భాగంగానే... తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కిట్స్ అందించింది. Say No Plastic అనే నినాదం లో భాగంగా... ప్లాస్టిక్ రహిత... వస్తువులను తెలంగాణ ఎమ్మెల్యేలకు ( MLAs) అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఇకపై రాగి బాటిల్స్ లో ( Copper bottles) నీళ్లు తాగేలా.... ప్రత్యేకమైన రాగి బాటిల్ కూడా అందించారు.


స్టీల్ టిఫిన్ బాక్స్ కూడా ఇచ్చారు. జూట్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కూడా అందించారు. నేతన్నలు నేసిన హ్యాండ్ కర్చీఫ్ కూడా అందించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి ఉండే ఒక ప్రత్యేక మైన బుక్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నిటిని పెట్టుకునేందుకు జ్యూట్ బ్యాగ్ ఇచ్చారు. సచివాలయానికి వస్తే.. ప్లాస్టిక్ తీసుకురాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. మొదట తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్లాస్టిక్ ( Plastic ) రహిత వస్తువులు వాడితే... ప్రజల్లో కూడా మార్పు వస్తుందనే ఉద్దేశంతో.. ఈ కిట్స్ అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. దీనివల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జనాలు కూడా ప్లాస్టిక్ రహిత పదార్థాలు వాడితే మంచిది.

Next Story