ఆర్‌కే కాంప్లెక్స్‌లో దొంగల హల్‌చల్

by Disha Web Desk 4 |
ఆర్‌కే కాంప్లెక్స్‌లో దొంగల హల్‌చల్
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్‌కే కాంప్లెక్స్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆర్‌కే కాంప్లెక్స్‌లోని రెండు షెటర్ల తాళాలు పగలగొట్టిన దుండగులు షట్టర్లను పైకెత్తి లోనికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఆర్కే కాంప్లెక్స్‌లోని సాయి కృప ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్, సాయి మీసేవ సెంటర్ల సెంటర్లలో చొరబడి నగదును ఎత్తుకెళ్లినట్లు ఆ దుకాణాల యజమానులు తెలిపారు. ఈ రెండు షాపులలో రూ.4000, రూ.3000 చోరీకి గురైనట్లు బాధితులు ఆర్మూర్ పోలీసులకు తెలిపారు.

ఈ షాప్‌ల‌తో పాటు మరో బట్టల దుకాణం షట్టర్‌ను సైతం గుర్తు తెలియని దుండగులు పైకెత్తి చోరీకి పాల్పడేందుకు విఫలయత్నం చేసినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దుండగులు ఎంత ప్రయత్నించినా ఆ బట్టల దుకాణం షట్టర్ పైకి రాకపోవడంతో దుండగులు అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కేవలం నగదు మాత్రమే ఎత్తుకెళ్లిన దుండగలు కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని వదిలేయడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్సై రాము పోలీస్ కానిస్టేబుల్‌లతో సోమవారం పరిశీలించారు. సదరు షాపు యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Next Story

Most Viewed