- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay : మీ గొంతుకై నినదిస్తరు..ఒక్క అవకాశమివ్వండి : బండి సంజయ్
ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం 317పై మేం కుటుంబాలను కూడా వదులుకుని పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులకు వెరవకుండా పోరాడామని..బీజేపీ కార్యకర్తల పోరాటాలను గుర్తించుకుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC Elections) అభ్యర్థి మల్క కొమురయ్యను గెలిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం 317పై మేం కుటుంబాలను కూడా వదులుకుని పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులకు వెరవకుండా పోరాడామని..బీజేపీ కార్యకర్తల పోరాటాలను గుర్తించుకుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC Elections) అభ్యర్థి మల్క కొమురయ్యను గెలిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పిలుపునిచ్చారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 317జీవోకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తగులుతున్నా తగ్గకుండా ఛాతీ ఎత్తి పోరాడామని..ఆంక్షలు,అడ్డంకులు సృష్టించినా మీకోసం గొంతెత్తినామని, అధికారం లేకుండానే టీచర్ల కోసం నిలబడ్డ తెగువ మాదన్నారు.
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు ఒక్క అవకాశం ఇవ్వండని..మీ గొంతుకై నినదిస్తరు.. మీ గోసలపై నిలదీస్తరు.. సమస్యలని ప్రస్తావిస్తరు.. పరిష్కార మార్గం పట్టిస్తరని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాబు క్యాలెండరు, నిరుద్యోగ భృతి, కొలువుల హామీలు.. అడ్డగోలు వాగ్దానాలతో పట్టభద్రులను సిగ్గులేకుండా మోసం చేసిందన్నారు. అందుకే టీచర్లు, ఉద్యోగులు అందరూ కలిసి ఈ భస్మాసుర హస్తానికి బుద్ధి చెప్పాలన్నారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బండకేసి కొట్టాలని, తెలంగాణలోని ఉద్యోగులు, యువత తమ దమ్ము చూపించే సమయం వచ్చేసిందన్నారు. కాంగ్రెస్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజల పక్షాన నిరంతరం కొట్లాడుతున్న బీజేపీ పార్టీకి చెందిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.






