- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లతో తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లాలని చూశారు : భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఖమ్మంలో జరిగిన గిడ్డంగుల సముదాయ భవనాల శంకుస్థాపనలో పాల్గొన్న బట్టి విక్రమార్క.. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టారు. బనకచర్ల ద్వారా గోదావరి నీటిని రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీనివల్ల తెలంగాణకు చెందిన 968 టీఎంసీల నీటి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఏపీ మంత్రి నారా లోకేష్, టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావిస్తూ, వారి నీటి హక్కులను కాజేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ బనకచర్లను "వృధా జలాల" కోసమే అని చెప్పినప్పటికీ, వరద జలాల్లో కూడా నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందని భట్టి స్పష్టం చేశారు.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు తలెత్తాయని ఫైర్ అయ్యారు. పైగా తమపైనే బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలతో ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. అర్థరాత్రి కేటీఆర్ లోకేష్‌ను కలవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై, కృష్ణా, గోదావరి నీటి హక్కులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుందని అన్నారు. బనకచర్లపై చర్చ అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేసినట్లు భట్టి తెలిపారు.






