సభకే రారు.. సభా హక్కుల గురించి మాటలా: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 04:52:20  IST  )

కృష్ణా జలాల విషయంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

సభకే రారు.. సభా హక్కుల గురించి మాటలా: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల విషయంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ (BRS) నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి సభకు రాకుండా బయట ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక కృష్ణా జిల్లా ప్రాజెక్టుల విషయంలో తాము చేసిన చారిత్రక తప్పిదాలు ఎక్కడ బహిర్గతం అవుతాయోనని భయపడి బీఆర్ఎస్ నేతలు దాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. సభకే రాని వీరు సభా హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అకారణంగా స్పీకర్‌పై నిందలు వేయడం బీఆర్ఎస్ సభ్యుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కవిత ఆరోపణలకు సమాధానం లేదాయే..

బీఆర్ఎస్ అవినీతిపై గతంలో ఆ పార్టీ నేత కవిత (Kavitha) చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆమె అంటున్నారని.. అందుకు కేసీఆర్ (KCR) సమాధానం చెప్పాలని తీరాలన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణంలో కూడా అక్రమాలు జరిగాయని ఆమె చెప్పడం బీఆర్ఎస్ అవినీతికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. సొంత కుటుంబ సభ్యులే పార్టీ అవినీతిని ఎత్తిచూపుతుంటే, సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పట్టుదల వల్లే కృష్ణా జలాల దోపిడీ ఆగిపోయిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు సీఎం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆది శ్రీనివాస్ అన్నారు.

Read More..

కాసేపట్లో BRS సమాంతర అసెంబ్లీ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్, హరీశ్‌రావు

Next Story