- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వాసుపత్రులపై బురదజల్లుతున్నరు.. BRSపై మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులపై బుదరజల్లుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులపై బుదరజల్లుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. బస్తీ దవాఖానాలపై ఇటీవల కేటీఆర్, హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడతూ.. బస్తీ దవాఖానాల్లో ద్వారా ప్రతిరోజూ సుమారు 45 వేల మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అన్ని రకాల మెడిసిన్లు అక్కడ అందుబాటులో ఉన్నాయని అన్నారు. డయాగ్నస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నామని తెలిపారు. 24 గంటల లోపు టెస్ట్ రిపోర్టులు పేషెంట్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందడం వల్లే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పేషెంట్ల రద్దీ తగ్గిందన్నారు. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమని కామెంట్ చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లకు లాభం చేకూర్చే విధంగా వారు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వారికి సరైన సమయంలో మరోసారి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు మా డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు. బస్తీ దవాఖానాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మా ప్రయత్నం కొనసాగుతోందని మంత్రి దామోదర స్పష్టం చేశారు.
Read More: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ‘ఒరికా’ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి






