- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్ళు పేరుకే 'విద్యార్థులు'.. చేసే పనులేమో 'అవి'
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. రాష్ట్ర నలుమూలలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న సమాచారం అందినా.. వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. రాష్ట్ర నలుమూలలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న సమాచారం అందినా.. వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక వేళ తనిఖీలలో పట్టుబడితే మాత్రం వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కి తరలిస్తున్నారు. అయితే తాజాగా ఎక్సైజ్ అధికారులు చేసిన తనీఖీలలో.. కొంతమంది స్టూడెంట్స్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. విద్యార్థుల తల్లితండ్రులు కూలీ పని చేసి డబ్బులు పంపుతూ చదివిస్తే.. వాళ్లేమో చదువులను గాలికి వదిలేసి జల్సాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడేమో గంజాయి అమ్ముతూ పోలీసులకు రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రా ఒరిస్సా బార్డర్ లో వీరు రూ. 4000 కు కిలో చొప్పున కొనుగోలు చేసి , హైదరాబాద్ కి తీసుకు వచ్చి, నగరంలో పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆ సమయంలోనే వారు పోలీసులకు చిక్కారు. అయితే ఈ యువకులు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మల్కాజ్ గిరి ఎక్సైజ్ సూపెరిండెంట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ పరిధిలో.. ఎక్సైజ్ శాఖ పోలీసులు 5. 217 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ యువకులు 100 గ్రాముల గంజాయిని స్థానిక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అమ్ముతుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వారి నివాసంలో తనిఖీ చేయగా మొత్తం 5.217 కిలోలు దొరికినట్లు తెలిపారు.
గంజాయికి యువత బానిస అవ్వటమే కాదు, జల్సాలకు కూడా అలవాటు పడి, చదువు పేరిట హైదరాబాద్ వచ్చి, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ.. చివరకు నిందితులుగా మారుతున్నారు. దీంతో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది.






