ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాన్నే బధనాం చేస్తున్నారు: మంత్రి పొన్నం

by Ramesh Goud |

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాన్నే బధనాం చేస్తున్నారని, చార్జిషీట్ ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar Goud) అన్నారు.

ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాన్నే బధనాం చేస్తున్నారు: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాన్నే బధనాం చేస్తున్నారని, చార్జిషీట్ ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar Goud) అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్లను ఈడీ చార్జీషీట్ లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం రాష్టవ్యప్తంగా నిరసనలు (Protests) చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ నియోజకవర్గ (Husnabad Constiency) కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు (Congress Leaders) పెద్దఎత్తున పాల్గొన్నారు. దీనిపై మంత్రి పొన్నం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ (BJP)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. గుజరాత్ (Gujarat) లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశం (AICC Pleanary Meeting) తరువాత బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల (ED Cases) పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంటే చూసి ఓర్వలేక అది నాయకత్వాన్ని ఈడీ కేసుల పేరుతో, చార్జిషీట్ ల పేరుతో ఇబ్బందులు పేడుతుందని మండిపడ్డారు. అంతేగాక నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్ర్యం కోసం పని చేసిందని, దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలని అనుకుంటే.. వందల మంది ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసిన వాళ్ళు అవినీతికి పాల్పడకపోయేవారా అని ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బధనామ్ చేస్తున్నారు..! అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story