- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NDSA పేరు చెప్పి పొలాలు ఎండబెడుతుండ్రు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
They are burning the fields in the name of NDSA.. MLC Kavitha's sensational comments

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం (Kaleshwaram)తో పాటు అనుబంధ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) ఏడో బ్లాక్‌లో ప్రతిరోజు లెవల్స్ రీడింగ్ తీసుకుంటున్నారు. మిగతా బ్లాకులలో రెండు వారాలకు ఒకసారి రీడింగ్ చెక్ చేస్తున్నారు. అయితే, ఆ రిపోర్టును ప్రతి 15 రోజులకు ఒకసారి నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ (NDSA)కి పంపుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ కూలిపోయింది.. కొట్టుకుపోయింది అన్నది నూటికి నూరుపాళ్లు అవాస్తవమేనని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో కుంగింది రెండు పిల్లర్లు మాత్రమేనని తెలిపారు. ఆ రెండు పిల్లర్లు కుంగిన నాటి నుంచి మేడిగడ్డ మీదుగా 5,657 టీఎంసీల నీళ్లను అధికారులు కిందికి వదిలారని పేర్కొన్నారు. అందులో సగానికిపైగా నీళ్లు కుంగిందని చెబుతోన్న ఏడో బ్లాక్ నుంచే వెళ్లాయని.. అయినా బ్యారేజీ ఏమాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. మరమ్మతులు చేస్తే మేడిగడ్డనే తెలంగాణ (Telangana) జీవగడ్డగా నిలుస్తుందని.. కాళేశ్వరమే తెలంగాణ జీవధార అవుతుందనే వాస్తవాన్ని ఇకనైనా పాలకులు గుర్తించాలని హితవు పలికారు. ఎన్డీఎస్ఏ (NDSA) పేరు చెప్పి రైతుల పొలాలు ఎండబెట్టే ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని, మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి పంట పొలాలకు నీళ్లివ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.






