Big Thieves : వారు భారీ దొంగలు..! చిక్కిన ముఠా!!

by Y. Venkata Narasimha Reddy |

దొంగల్లో ఈ దొంగలు వేరయా..అన్నట్లుగా జీడిమెట్ల పోలీసులకు చిక్కిన దొంగల ముఠా సభ్యుల దొంగతనాలు వెరీ స్పెషల్ గా ఉన్నాయి. క్రేన్లు, రోడ్డు రోలర్ లు వంటి భారీ వాహనా(Heavy Vehicles)లే ఈ భారీ..దొంగల(Big Thieves) ముఠా టార్గెట్ కావడం విశేషం.

Big Thieves : వారు భారీ దొంగలు..! చిక్కిన ముఠా!!
X

దిశ, వెబ్ డెస్క్ : దొంగల్లో ఈ దొంగలు వేరయా..అన్నట్లుగా జీడిమెట్ల పోలీసులకు చిక్కిన దొంగల ముఠా సభ్యుల దొంగతనాలు వెరీ స్పెషల్ గా ఉన్నాయి. క్రేన్లు, రోడ్డు రోలర్ లు వంటి భారీ వాహనా(Heavy Vehicles)లే ఈ భారీ..దొంగల(Big Thieves) ముఠా టార్గెట్ కావడం విశేషం. హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసు(Police)లు అరెస్టు చేశారు.

భారీ వాహనాలను చోరీ చేసి స్క్రాబ్(Scrub)లో అమ్మేవేయడమే పనిగా ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది. ముఠా సభ్యులు అవ్రోద్ అహ్మద్ పటేల్(గుల్బార్గా), మహ్మద్ ఇబ్రహీమ్(జహీరాబాద్), షేక్ అన్వర్(డీసీఎం ఓనర్, డ్రైవర్), రామ సత్యనారాయణ(క్రేన్ ఓనర్, ఆపరేటర్)లు పోలీసుల అదుపులో ఉండగా, సయ్యద్ ముస్తఫా పరారీలో ఉన్నాడు. భారీ వాహానాలను చోరీ చేసి ఇబ్రహీమ్ కు జహిరాబాద్ స్క్రాబ్ దుకాణంలో అమ్మడాన్ని నిందితులు పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం మిగతా వారికి ఇబ్రహీమ్ డబ్బులిస్తుంటాడు.

చోరీకి ఎంపిక చేసిన భారీ వాహనాల వద్ధకు క్రేన్లు తీసుకవచ్చి వాటిని అమాంతం డీసీఎంలోకి లిఫ్టు చేసి జహీరాబాద్ లోని ఇబ్రహీమ్ స్క్రాబ్ షాప్ కు తరలించడం జరుగుతోంది. ఇలా వారు చోరీలు చేసే క్రమంలో తాజాగా ఈ నెల 21న జీడిమెట్ల సుభాష్ నగర్ లో పార్కు చేసిన రోడ్డు రోలర్ ను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఈ భారీ దొంగల ముఠా పట్టుబడింది. రోడ్డు రోలర్ ను తరలిస్తున్న డీసీఎం రిపేర్ తో వారు దొరికిపోయారు. నిందితుల నుంచి చోరీ చేసిన 2 క్రేన్లు, రోడ్డు రోలర్ తో పాటు 4 మొబైల్స్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Next Story