- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Girls..Be Careful : నమ్మించి వంచిస్తున్నారు.. అమ్మాయిలు జాగ్రత్త!
నమ్మించి వంచిస్తున్నారు(Tricked Into Believing)...అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త(Girls..Be Careful) అని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(IPS, TG RTC MD V.C. Sajjanar)హెచ్చరించారు(Warned).

దిశ, వెబ్ డెస్క్ : నమ్మించి వంచిస్తున్నారు(Tricked Into Believing)...అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త(Girls..Be Careful) అని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(IPS, TG RTC MD V.C. Sajjanar)హెచ్చరించారు(Warned). సమాజంలో ఇలా నమ్మించి నయవంచనకు గురిచేసే మోసగాళ్లు పెరిగిపోతున్నారని.. న్యూడ్ ఫొటోలు, వీడియోలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తు్ హాస్టల్ లో ఉంటున్న ఏపీ నిడదవోలుకు చెందిన ఓ యువతిని హాస్టలో లో స్నేహితురాలుగా ఉన్న మహిళ మోసగించిన సంఘటనను ఆయన పోస్టు చేశారు.
బాధిత యువతిని ఇంటర్నెట్ లో మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలు పెడుతామని ఆమె స్నేహితురాలే భర్తతో కలిసి బెదిరించి రెండున్నర కోట్లు వసూలు చేసిన ఘటన స్నేహం ముసుగుల మోసాలకు నిదర్శనంగా పేర్కొన్నారు.స్నేహం ముసుగులో జరుగుతున్న దారుణాలను తెలుసుకోలేక అమాయకులైన అమ్మాయిలు నిండా మునుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని..తమ పరువు ఎక్కడ పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనేక మంది భయపడుతున్నారని సజ్జనార్ అభిప్రాయపడ్డారు.
గుర్తుపెట్టుకోండి.. ఇలాంటి వారు పాము కన్నా ప్రమాదకరమైన వారని.. స్నేహితులను ఎంచుకునే విషయంలో గుడ్డిగా వ్యవహారించకండని హెచ్చరించారు. స్నేహం ముసుగులో మోసం చేసే వారు చుట్టుపక్కల చాలా మందే ఉంటారని.. వీళ్లు స్నేహంగా మెలుగుతూనే అవసరమొచ్చినప్పుడు తమ బుద్దిని చూపెడుతుంటారన్నారు. స్నేహం.. స్నేహం వరకే ఉండాలని.. స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే నష్టం అనేది తప్పదని.. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్రెండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఎవరిని పడితే వారిని ఫాలో కాకండని సూచించారు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమాత్రం పనికి రాదని..ఉద్యోగాల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. వారి రోజువారీ కదలికలను అడిగి తెలుసుకోవాలని.. ముఖ్యంగా అజ్ఞాత వ్యక్తులతో స్నేహం విషయంలో ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పారు. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదని.. ముందే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని విలువైన సూచనలు చేశారు.






