- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ: కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు, సూచనలు ఇవే..
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియపైన ఆ పార్టీ అనేక అంశాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఇచ్చిన వినతి పత్రంలో పొందుపర్చింది. తమ సూచనలు, ఆందోళనలను నమోదు చేయాలని, ఆ ప్రక్రియ న్యాయంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని పార్టీ కోరుకుంటున్నట్లుగా కాంగ్రెస్ తెలిపింది.
పెరిగిన ఓటరు భారం, సరైన ప్రణాళిక..
తెలంగాణ (ఉమ్మడి ఏపీ)లో గత ఎస్ఐఆర్ 2002 సంవత్సరంలో దాదాపు 3 నెలల వ్యవధిలో నిర్వహించారు. అప్పటి నుంచి, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 1.2 కోట్లు పెరిగింది. (2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మొత్తం ఓటర్లు 5,11,46,498 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2025లో మొత్తం ఓటర్లు 3,35,27,925) ప్రభుత్వ అధికారులతో పాటు పని పెరిగినందున ప్రస్తుత కసరత్తును నిశితంగా, దశలవారీగా ప్లాన్ చేయాలి. తొందరపాటు అమలును నివారించడం, ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు.. ఇతర రాష్ట్రాల్లోని అనుభవాల దృష్ట్యా 2026లో ఎస్ఐఆర్ ప్రక్రియను 2-3 నెలల వ్యవధిలో తొందరగా ముగించకుండా సహేతుకమైన వ్యవధిలో చేపట్టాలి. రాబోయే 2-3 సంవత్సరాలలో పెద్దగా ఎన్నికలు లేనందున ఎస్ఐఆర్ ప్రక్రియ ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వ్యవధిలో నిర్వహించవచ్చు. అధికారులపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకే సిబ్బందికి రెండు బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఓటర్ల జాబితాలను అందించడం, అభ్యంతరం, నోటీసు వ్యవధి పొడిగింపు, విద్యార్థుల నమోదు సమస్యలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 2002, 2025 నాటి ఓటర్ల జాబితాలను సాఫ్ట్ కాపీలో అందించాలి. ప్రాధాన్యంగా ఓసీఆర్ లేదా మెషిన్-రీడబుల్ కాపీతో పాటు హార్డ్ కాపీని కూడా అందించాలి. అభ్యంతరాలను దాఖలు చేయడానికి ప్రస్తుతం నిర్దేశించిన వ్యవధిని కనీసం ఒక నెల వరకు పొడిగించాలి. ప్రతి పౌరుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కింద జారీ చేయబడిన ఏదైనా నోటీసుకు ప్రతిస్పందించడానికి కనీసం ఒక నెల వ్యవధిని మంజూరు చేయాలి.
తొలగింపునకు ముందు భౌతిక నోటీసు..
ఏదైనా ఓటరు పేరును తొలగించే ముందు, కనీసం ఏడు రోజుల వ్రాతపూర్వక నోటీసు అందించాలి. తెలంగాణలో, సాక్షుల సమక్షంలో వ్యక్తిగతంగా లేదా డాక్యుమెంట్ ప్రక్రియ ద్వారా నోటీసులు అందజేయాలి. బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) నమోదు ప్రక్రియ, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) సందర్శనల రుజువు, ప్రతి బూత్‌లో బూత్ లెవల్ ఏజెంట్ల కోసం తాజా నమోదు డ్రైవ్ చేపట్టాలి. ఆ నియామకాలు పూర్తయిన తర్వాత మాత్రమే బూత్ స్థాయి అధికారులచే ధృవీకరణ ప్రారంచాలి. ఎస్ఐఆర్ కి ముందు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లేదా జిల్లాలో బీఎల్ఏలందరికీ శిక్షణ ఇవ్వాలి. బీఎల్ఓల ద్వారా ఓటర్ల ధృవీకరణను గరుడ యాప్‌లో సూచించిన ఫారమ్‌లు లేదా ఎంట్రీల ద్వారా సక్రమంగా నమోదు చేయాలి. జియో-ట్యాగ్ చేయబడిన ఛాయాచిత్రాల ద్వారా కనీసం మూడు గృహ సందర్శనల రుజువు తప్పనిసరి.
ఐదేళ్లపాటు డేటాను భద్రపరచడం..
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన మొత్తం డేటాను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) స్థాయిల్లో కనీసం ఐదు సంవత్సరాల పాటు భద్రపరచాలి. అవసరమైనప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలి. బలహీన వర్గాలకు శిక్షణ మరియు రక్షణ, 2002 తర్వాత వలస వచ్చిన వారికి సడలింపు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. సాధ్యమైన చోట ఆ సంఘాల నుంచి బీఎల్ఓలను నియమించాలి. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణకు వలస వచ్చిన వ్యక్తులు, 2002 రోల్స్‌లో ఎవరి పేర్లు లేదా పూర్వీకుల పేర్లు కనిపించవు. అటువంటి వ్యక్తులు కనీసం రెండు ఎన్నికల్లో స్థానికంగా ఓటు వేసినట్లయితే, చేర్చడానికి సరిపోతుందని అఫిడవిట్ అంగీకరించాలి.
పౌరసత్వ రుజువు కోసం డిమాండ్ చెయ్యకూడదు..
ఎన్నికల ప్రకటన తర్వాత నమోదుపై పరిమితి, పౌరసత్వానికి సంబంధించిన రుజువును ఎన్నికల సంఘం డిమాండ్ చేయదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బ్యాక్‌డోర్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియగా మారకూడదు. ఓటరు నమోదు యొక్క చట్టబద్ధమైన ప్రక్రియకు మాత్రమే పరిమితం కావాలి. ఇటువంటి పద్ధతి పెద్ద ఎత్తున బోగస్ ఎంట్రీలకు దారితీసింది. వాటిని నిలిపివేయాలి. ఓటరు నమోదును నామినేషన్ల వరకు కొనసాగించడానికి అనుమతించకూడదు. ఈ పద్ధతి పెద్ద ఎత్తున బోగస్ ఎంట్రీలకు దారితీసింది. వాటిని నిలిపివేయాలి.
ప్రీ-ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కింది లోపాలు మా దృష్టికి వచ్చాయి..
అనేక ప్రాంతాల బూత్ స్థాయి అధికారులు ఈసీఐ ప్రకారం తప్పనిసరిగా ఇంటింటికీ ధృవీకరణను చేపట్టడానికి బదులుగా నిర్దిష్ట రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఒక స్థిర ప్రదేశంలో కూర్చొని మ్యాపింగ్ / ధృవీకరణ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అన్ని డీఈవోలు మరియు ఈఆర్వోలకు ఖచ్చితమైన సమ్మతిని కోసం, రాజకీయ పార్టీల ద్వారా అనవసరమైన ప్రభావాన్ని నిరోధించడానికి అవసరమైన సూచనలను జారీ చేయాలి. మ్యాపింగ్‌లో ఏదైనా పొరపాటు జరిగితే మార్పులను అనుమతించాలి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెద్దగా చదువుకోని, ఇంగ్లీషులో చదవడం, రాయడం రాని వారిని బీఎల్ఓ గా నియమిస్తే ప్రీ-ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అనేక సమస్యలు వస్తున్నాయి.






