- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: హిందుత్వంపై కేసీఆర్, ఫిలాసఫి పై కేటీఆర్.. తండ్రి కొడుకులు తాజాగా చదువుతున్న పుస్తకాలు ఇవే
కేసీఆర్, కేటీఆర్ తాజాగా పుస్తక పఠనం పై ఫోసక్ పెంచినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు (Kcr) పుస్తక పఠనం అలవాటు గురించి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా వివిధ అంశాలకు సంబంధించిన రకరకాల పుస్తకాలను (Book Reading) ఆయన చదువుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టేందుకు ప్రపంచ స్థాయి తత్వవేత్తల రచనలు అధ్యయనం చేస్తుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తర్వాత ఎక్కువ శాతం పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించిన కేసీఆర్.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా కేసీఆర్ సంసిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.తాజాగా కేసీఆర్ టేబుల్ పై కనిపించిన ఓ పుస్తకం ఇందుకు అవుననే సమాధానం ఇస్తోంది. ఈ నెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్నది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లా, పార్టీ మహిళా నేతలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ టేబుల్ పై కనిపించిన ఓ పుస్తకం ఆసక్తిగా మారింది.
టార్గెట్ మోడీ?:
సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం రచించిన 'గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా (1915-2015, ఆ తర్వాత)' అనే పుస్తకం కేసీఆర్ టేబుల్ పై దర్శనం ఇచ్చింది. దీన్ని బట్టి కేసీఆర్ ఈ పుస్తకంలోని అంశాలను అధ్యయనం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ పుస్తకంలో రచయిత దేశ సమకాలీన పరిస్థితులను విశ్లేషించారు. ముఖ్యంగా 1920 దశపు గాంధీయిజం నుంచి ప్రస్తుత మోడీ పాలన వరకు వందేళ్ళకు పైగా భారత ముఖ చిత్రాన్ని పుస్తకంలో ఆవిష్కరించారు. అలాగే మోడీ (Narendra Modi) ప్రభుత్వం ఏం చేసినా ఒప్పేనని సమర్థించే ఒక బలమైన విద్యావంతుల వర్గం ఇటీవల కాలంలో బలం పుంజుకుంటోందనే విషయాన్ని ఈ పుస్తకంలో రచించారు. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ విధానాలపై విమర్శలు గుప్పించే కేసీఆర్ ఈ పుస్తక పఠనం ద్వారా కేంద్రంలోని బీజేపీని, నరేంద్ర మోడీని మరింతత విషయ పరిజ్ఞానంతో టార్గెట్ చేయబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో మోడీని గులాబీ బాస్ ఏ రకంగా టార్గెట్ చేస్తారనేది వేచి చూడాలి.
కేటీఆర్ చేతిలో మార్కస్ ఓరీలియస్ మెడిటేషన్:
మరో వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోమన్ చక్రవర్తి, ఫిలాసఫర్ మార్కస్ ఓరీలియస్ (Marcus Aurelius) మెడిటేషన్ పుస్తకాన్ని పఠిస్తున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఐదుగురు మంచి చక్రవర్తుల్లో ఆఖరివాడైన మార్కస్ ఓరీలియస్ స్టాయిసిజాన్ని ఫాలో అయివాడు. ఈ క్రమంలో ఆయన తన ఓన్ స్టాయిక్ ప్రాక్టీసెస్స ను రాసుకున్నారు. ఆ తర్వాత అతడి రచనలు మెటిడేషన్ పేరుతో 12 పుస్తకాలను పబ్లిష్ చేశారు. పవర్ ఫుల్ బిహేవియర్, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా ఆలోచన చేయాలో మార్కస్ తన డైరీలో రాసుకున్నారు. ఈ పుస్తకాన్ని కేటీఆర్ ఇప్పుడు చదువుతుండటం ఆసక్తిగా మారింది. తండ్రి కేసీఆర్ హిందుత్వ అంశంపై దృష్టి సారిస్తే కేటీఆర్ స్టాయిస్ ఫిలాసఫిపై ఫోకస్ పెట్టారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.






