కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర జరిగింది.. ఆర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation) ప్రాజెక్టును పేల్చివేసే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర జరిగింది.. ఆర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation) ప్రాజెక్టును పేల్చివేసే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిన విషయం సంచలనం సృష్టించిందని తెలిపారు. సాధారణ ఎన్నికల సమయం బీఆర్ఎస్ (BRS) పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతినేలా కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే ఎలాంటి శబ్ధాలు రావని ఇంజినీర్లు నిపుణులు చెప్పారని.. అయితే, బ్యారేజీ వద్ద శబ్దాలు వినిపించాయని ఏఈఈ రవికాంత్ కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనలో అసాంఘిక శక్తులెవరో తేల్చాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్‌ రెడ్డి (Revanth Reddy), బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. ఫోన్‌ డేటాను చెక్‌ చేస్తే ఆనాడే దొరికేవాళ్లంటూ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పేలుళ్ల శబ్దాలపై.. ఇంత వరకు NDSA ఎందుకు మాట్లాడటం లేదని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ మంచిపేరు రావడం జీర్ణించుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగం అంటూ పక్కన పెడుతోందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఆరోపించారు.

Next Story