- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవాడు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణ (Telangana)లోనూ ఓ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉండేవాడని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లోనూ ఓ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉండేవాడని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లో బిజినెస్ స్టాండర్డ్స్ యానువల్ ఫోరం (Business Standards Annual Forum) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై ఘాటుగా స్పందించారు. ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజుల కొనసాగవని అన్నారు. రాత్రి కలలో అనుకుంది పగులు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారంటే మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను ఉద్దేశించిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చినట్లుగా పాలన చేయడం వల్లే కేసీఆర్‌ను ప్రజలకు మూకుమ్మడిగా ఓడగొట్టి ఫామ్‌హౌస్‌లో కూర్చొబెట్టారని కామెంట్ చేశారు. ట్రంప్ ఒక రోజు నరేంద్ర మోడీ (Narendra Modi) తన మిత్రుడు అంటారని.. ఆ మరునాడే భారత్‌పై 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టమని అన్నారు. ఇప్పటికే ట్రంప్ ఏడాది పాలన పూర్తయిందని, మరో మూడేళ్లు మాత్రమే తనకు నచ్చింది చేయగలరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌కు 3 వేల ఈవీ బస్సులు..
హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందకు ప్రణాళికలు రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా త్వరలో హైదరాబాద్ నగరంలో 3 వేల ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో తిరుగుతన్న నాన్ ఈవీ బస్సులను పూర్తిగా గ్రామాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. హైదరాబాద్-బెంగళూరు (Bengaluru)కు బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)కు అనుబంధంగా రీజినల్ రింగ్ రోడ్డును (RRR) ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఫార్మా, ఇతర రంగాలకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీసుకొచ్చిన ఈగల్ స్క్వాడ్ సమర్ధవంతంగా పని చేస్తోందని గుర్తు చేశారు. ఇటీవల వెలువడిని పోలీస్ ర్యాంకింగ్‌లో తెలంగాణ స్టేట్ నెంబర్‌వన్‌గా ఆవిర్భవించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






