సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఉద్దేశం కనిపిస్తోంది : కూనంనేని సాంబశివరావు

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఉద్దేశం కనిపిస్తోంది : కూనంనేని సాంబశివరావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటగా ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది. ఇందులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి గురించి పలు ప్రశంలు లేవనెత్తారు. తెలంగాణలో సింగరేణి ప్రధానమైన సంస్థ అని అయినప్పటికీ సింగరేణి కార్మికుల్లో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుందన్నారు. వీటిని పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. లేదంటే సింగరేణి పూర్తిగా కనుమరుగయ్యి, ప్రయివేటు పరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని అన్నారు.

మెడికల్ అన్ ఫిట్ ను సరైన పద్దతిలో అమలు చేయడం లేదని, కారుణ్య నియామకాలకు వయస్సు 35 నుంచి 45 కు పెంచినప్పటికీ, వివిధ కారణాలు చూపి నియామకాలు చేయడం లేదన్నారు. కార్మికులకు సొంత ఇంటి పథకం లేదని, కొత్త గనులను సింగరేణి దక్కించుకొని అందులో సింగరేణి కార్మికులను మాత్రమే నియమించుకోవాలని సభలో కోరారు.

Next Story