ఇంకా వరద ముప్పు ఉంది.. బీ కేర్ఫుల్ : అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.

ఇంకా వరద ముప్పు ఉంది.. బీ కేర్ఫుల్ : అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలైన ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. అయితే తీవ్ర వరద ప్రభావిత ప్రాంతం అయిన కామారెడ్డి పట్టణం మొత్తం వరద గుప్పిట్లో మునిగిపోవడంతో సీఎం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేక.. మెదక్ పట్టణంలో దిగాల్సి వచ్చింది. మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో వరద పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఇంకా వరద ముప్పు పోలేదని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేసారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. రోడ్లు తెగిన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

Next Story