వినాయక నిమజ్జనాల్లో గొడవలు, ప్రమాదాలు జరిగాయి : సీపీ సీవీ ఆనంద్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లో వినాయక ప్రతిమల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసినట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

వినాయక నిమజ్జనాల్లో గొడవలు, ప్రమాదాలు జరిగాయి : సీపీ సీవీ ఆనంద్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో వినాయక ప్రతిమల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసినట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ట్యాంక్ బండ్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన.. 10 రోజుల్లో లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా.. రెండ్రోజుల్లో ఒక్క ట్యాంక్ బండ్ పైనే 25 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లు తెలిపారు. మరో 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని, వాటిని మధ్యాహ్నం 2 గంటల్లోగా నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈసారి నగరంలో వినాయక విగ్రహాల ఎత్తు అధికంగా ఉందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలకు విద్యుత్ వైర్లు తాకడంతో ఊరేగింపులో ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపారు. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయని, కొందరు వ్యక్తులు గొడవలు పడగా.. 5 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

నిమజ్జనాలు పూర్తయ్యాక బషీర్ బాగ్, లిబర్టీ మార్గాలను పూర్తిస్థాయిలో ఓపెన్ చేస్తామనిచెప్పారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ - ఖైరతాబాద్ రూట్ ను నిమజ్జనం కార్యక్రమం పూర్తిస్థాయిలో పూర్తయ్యాక పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ లో ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ చేశామని, అక్కడ విగ్రహాల నిమజ్జనం నిదానంగా కొనసాగుతుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనాలను పూర్తి చేయడంలో సహకరించిన అందరికీ పేరుపేరున అభినందనలు తెలిపారు.

Next Story