ల‌డ్డూ ప్రసాదంపై ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు.. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి

by Kema Shiva Kumar |

వేముల‌వాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై ఆరోపణల్లో వాస్తవం లేదని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు.

ల‌డ్డూ ప్రసాదంపై ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు.. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేముల‌వాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై ఆరోపణల్లో వాస్తవం లేదని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవదాయ కమిషనర్‌కు సమగ్ర నివేదిక సమర్పించినట్లు ఆమె శనివారం పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం తయారీ ఎక్కడా ఎటువంటి లోపం జ‌ర‌గ‌లేద‌ని, భ‌క్తుల మ‌నోభావాలను గౌర‌వించే ప్రక్రియ‌లో భాగంగా కీల‌క చ‌ర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం 11 గంటల సమయంలో ప్రసాద విక్రయాల వద్ద లడ్డూ ప్రసాదంలో బూజు పట్టినట్లు ప్రచారం జరిగిందని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే విచారణ చెపట్టామని తెలిపారు.

ప్రసాదం ఖరీదు చేసిన భక్తులను ప్రసాదం నాణ్యత విషయంలో విచారించగా లడ్డూ, పులిహోర ప్రసాదాలు నాణ్యతతో ఉన్నాయని తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అదే సమయంలో ఇతర భక్తులెవరూ ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. స్వామి వారి లడ్డూ ప్రసాదం విషయంలో అవాస్తవాలను ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఫోన్ ద్వారా సంప్రదించి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రాచార చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా ఈవో రమాదేవి మీడియాకు తెలిపారు.

Next Story