రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ ప్లాంట్లు : టీజీ రెడ్కో

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా టీజీ రెడ్కో అడుగులు వేస్తోంది.

రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ ప్లాంట్లు : టీజీ రెడ్కో
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ర్టంలో సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా టీజీ రెడ్కో అడుగులు వేస్తోంది. ఇటీవలే తెలంగాణ క్లీన్​అండ్ గ్రీన్​ఎనర్జీ పాలసీ 2025ను తీసుకువచ్చిన సర్కారు ఆ దిశగా ముందుకు వెళ్లబోతోంది. ఈ క్రమంలో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పటు చేయించేందుకు టీజీ రెడ్కో చర్యలు తీసుకుంటోంది. మహిళలతో పాటు ముందుకు వచ్చే వారందరికీ కూడా సహకారం అందించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈ దిశగా సింగరేణి సంస్థ ముందడుగు వేసింది . ముఖ్యంగా సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవడమే కాకుడా పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ ఇటీవలే మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా మందమర్రి సౌర ప్లాంట్‌లో పగటిపూట ఉత్పత్తి జరిగి వినియోగం తర్వాత మిగిలే విద్యుత్‌ను వృథాగా పోనీయకుండా ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం’లో నిల్వ చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయిస్తున్నారు. ఇక్కడున్న 28 మెగావాట్ల సౌర విద్యుత్​ప్లాంట్‌ వద్ద ఒక మెగావాట్‌ నిలువ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ను సిద్ధం చేయిస్తున్నారు. ఈ విధానం వల్ల నెలకు రూ.13 లక్షల విలువైన సౌర విద్యుత్‌ వృథా కాకుండా సద్వినియోగం కానుందని సింగరేణి వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇది గనుక విజయవంతం అయితే మరో రెండు మెగావాట్ల సామర్థ్యం గల సిస్టమ్‌లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నామని, తద్వారా నెలకు రూ.40 లక్షల విలువైన సౌర విద్యుత్‌ సద్వినియోగం అవుతుందని సింగరేణి అధికార వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి చేస్తున్న ఈ తోడ్పాటును తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని టీజీ రెడ్కో అధికారులు వివరిస్తున్నారు.

టీజీ డిస్కంకే సౌర విద్యుత్​ అమ్మకం చేయిస్తాం ....రెడ్కో

రైతులు, మహిళ సంఘాలను ప్రోత్సహించి వారు ఉత్పత్తి చేసిన ఈ సౌర విద్యుత్ ను టీజీ డిస్కం లకు అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నామని టీజీ రెడ్కో అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, వారి చేత బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ప్లాంట్ల ను ఏర్పాటు చేయించడం ద్వారా తెలంగాణలోని పలు జిల్లాలలో సౌర విద్యుత్​ను తయారీ చేసి నిలువ చేయనున్నారు. ఇటీవలి కాలంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు, రైతులకు ఈ స్టోరేజీ ల ఏర్పాటు కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌర విద్యుత్​ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్న

టీజీ రెడ్కో దీనిని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, నల్లొండ, గద్వాల, నాగర్​కర్నూలు, రంగారెడ్డి , వికారాబాద్​ జిల్లాలలోని మహిళా సంఘాలకు ఇందుకోసం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయించే ఈ ప్లాంట్​గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతులకు పలు ఉదాహరణలతో వివరణ ఇస్తున్నారు. ఉదా.. ఆంధ్రప్రదేశ్​లో కూడా అక్కడి ప్రభుత్వం బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోందని వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాల్లో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నిర్మించడానికి కేంద్రం అంగీకారం తెలిపినట్లు వివరిస్తున్నారు.

సుమారు వేయి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోందంటున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా పొడిగించింది. దీంంతో ఏపిలోని నాలుగు జిల్లాలలో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారని అంటున్నారు. కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని వంద శాతం సోలార్ విద్యుత్ నియోజకవర్గంగా మార్చాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఈ నాలుగు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చేపట్టనున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.

Next Story