ప్రపంచంలో ఎక్కడా ఎర్రజెండా లేదు.. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు

by Kema Shiva Kumar |

ప్రపంచంలో కమ్యూనిజం అంతమైందని, ఇద్దరు వ్యక్తులు దానిని మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత రామచందర్ రావు విమర్శించారు.

ప్రపంచంలో ఎక్కడా ఎర్రజెండా లేదు.. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరికొంతమంది పోలీసులు ఎదుట సరెండర్ అయితే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కాగార్’ పూర్తవుతుందని తెలంగాణ బీజేపీ నేత రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అంతమైపోయిన కమ్యూనిజాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేసీఆర్‌ (KCR)లు మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు (Urban Naxalites)గా మార్చి వారి భవిష్యత్తును పాడు చేయవద్దని ఆయన హితవు పలికారు. రాబోయే రోజుల్లో అర్బన్ నక్సలిజాన్ని అంతం చేస్తామని తెలిపారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story