కళాశాలల బంద్ తప్ప వేరే మార్గం లేదు: ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య చీఫ్ రమేష్

by Kema Shiva Kumar |

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు గత నాలుగు రోజులుగా కళాశాలల నిరవధికంగా బంద్‌కు దిగిన విషయమే తెలిసిందే.

కళాశాలల బంద్ తప్ప వేరే మార్గం లేదు: ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య చీఫ్ రమేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు గత నాలుగు రోజులుగా కళాశాలల నిరవధికంగా బంద్‌కు దిగిన విషయమే తెలిసిందే. మరోవైపు పలు జిల్లాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చీఫ్ రమేష్ (Ramesh) మాట్లాడుతూ.. ఎన్ని సార్లు చెప్పినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇక కళాశాలల బంద్ తప్ప.. వేరే మార్గమే లేదన్నారు. గత నాలుగు రోజుల నుంచి అన్ని కాలేజీలు బంద్ పాటిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూ.10 వేల కోట్ల బకాయిల్లో 50 శాతం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. పరీక్షలు నిర్వహించేందుకు అన్ని కాళాశాలల్లో అధ్యాపకులు లేరని తెలిపారు. బకాయిలు విడతల వారీగా 10 నెలల్లో ఇవ్వాలని రమేష్ ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేశారు.

Next Story