- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు లేరు.. వర్ధంతి వేళ టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy) లాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Cheif Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy) లాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Cheif Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యుడినని సగర్వంగా చెప్పుకుంటానని అన్నారు.
ఆయన తనను కొడుకులా భావించారని, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు పరిచయం చేశారని గుర్తు చేశారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో లేరని.. భవిష్యత్తులో కూడా రారని అన్నారు. పాలనలో గొప్ప దార్శనికుడు, మార్గదర్శి మర్రి అని కొనియాడారు. యావత్ దేశం చూసిన అరుదైన రాజనీతిజ్ఞత, విషయ పరిజ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. గవర్నర్ పదవికి వన్నె తెచ్చిన మహానుభావుడు మర్రి చెన్నారెడ్డి అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.






