- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
సోషల్ మీడియాలో విపక్ష పార్టీలు బీజేపీ (BJP)పై ఎవరు పోస్టులు పెట్టినా ప్రతి కార్యకర్త అందుకు కౌంటర్ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో విపక్ష పార్టీలు బీజేపీ (BJP)పై ఎవరు పోస్టులు పెట్టినా ప్రతి కార్యకర్త అందుకు కౌంటర్ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) పిలుపునిచ్చారు. ఈ రోజు నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోషల్ మీడియా (Social Media), లీగల్ సెల్ (Legal Cell) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఇక నుంచి పార్టీ కార్యకర్తలు ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నకిలీ ఖాతాలు బీజేపీపై పోస్టులు పెడుతున్నాయని తెలిపారు. తమపై తప్పుడు వార్త రాసిన పత్రికపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశామని అన్నారు. బీజేపీ అంటూనే బీజేపీ నేతల మీదనే అడ్డగొలుగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. పార్టీపై ఎవరు పోస్టు పెట్టినా ప్రతి కార్యకర్త కౌంటర్ ఇవ్వాలని.. చిల్లర రాజకీయాలకు భయపడేది లేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు.






