CM Revanth Reddy : కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదమే లేదు: సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-06-18 15:17:41  IST  )

రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

CM Revanth Reddy : కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదమే లేదు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. గోదావరి-బనకచర్ల (Banakacharla Project) లింక్ ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్లపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై విపక్షాలతోనూ చర్చించామని.. ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం అని, సాగునీటి అంశంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని, బనకచర్లను అడ్డుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గత ప్రభుత్వ నాయకులు కాసులకు కక్కుర్తిపడి కాళేశ్వరం(Kaleswaram) కట్టారని మండిపడ్డారు. కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) కమీషన్ల కోసం గ్రావిటీ ద్వారా అందించాల్సిన నీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 96 కేబినెట్ సమావేశాలు జరిగితే ఒక్కదానిలో కూడా కాళేశ్వరానికి అనుమతి ఇచ్చినట్టు లేదని, కావాలంటే కేబినేట్ మినిట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక కాళేశ్వరం కమిషన్ కు అందించాల్సిన కేబినెట్ మినిట్స్ ను ఈనెల 30 లోపు అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Next Story