- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: అటల్ స్మృతి వర్ష్ సందర్భంగా, భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఎల్‌బీ నగర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశానికి అటల్ జీ అందించిన అపూర్వ సేవలు, ఆయన దూరదృష్టిగల నాయకత్వం, సుస్థిర పరిపాలన, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నెలకొల్పిన చిరస్థాయి వారసత్వం తరతరాలుగా అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు.
ఒకప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇద్దరూ ప్రజల కోసం కలిసి పని చేసేవారని, కానీ ఆ పరిస్థితి ఈ రోజు లేదని అన్నారు. అందుకే మోడీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితి తీసుకురావాలని నాయకులలో మార్పు తేవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వాజ్‌పేయి ఆశయాలను ఈ తరం నాయకులు పాటించాలని కోరుతున్నారని అన్నారు. వాజ్‌పేయి తర్వాత అంతటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ కొనియాడారు.
ఆయన సురక్షితమైన ప్రశాంతమైన పాలనను అందిస్తున్నారని వెల్లడించారు. కాలం మారింది ఇంకా పాత నాయకుల లాగా మాట్లాడవద్దు అనేవారికి ఒక్కటే చెప్తున్నాను ఓల్డ్ ఇస్ గోల్డ్.. అని అన్నారు. ప్రస్తుత నాయకుల భాష మారాల్సిన అవసరం ఉందని సూచించారు. వాజ్‌పేయి విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరు వారి మాట తీరు నేర్చుకోవాలని తెలిపారు. మనం ఎటు పోతున్నాం, ఎలాంటి భాషా ప్రయోగం చేస్తున్నాము ఆత్మ పరిశీలన చేసుకోవాలని నాయకులకు సూచించారు.






