కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమయ్యే చాన్స్ ఉంది.. పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ (BRS) పార్టీ కాంగ్రెస్‌ (Congress)లో వీలినమయ్యే పరిస్థితులే ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమయ్యే చాన్స్ ఉంది.. పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ కాంగ్రెస్‌ (Congress)లో వీలినమయ్యే పరిస్థితులే ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ (Sonia Gandhi)ని కలిసిన మాట వాస్తవం కాదా అని అన్నారు. 2014లోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన ఉన్నా.. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందుకు అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి పనుల పేరుతో వేములవాడ (Vemulavada) ఆలయాన్ని మూసివేయడం సరికాదని కామెంట్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆలయ అభివృద్ధి పనులు కొనసాగాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టాపోతున్నారని. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలకు మాత్రమే నిధుల వరుద పారుతోందని.. ఈ క్రమంలోనే మిగతా జిల్లాలు ఎడారిగా మారతున్నాయని పాయల్ శంకర్ అన్నారు.

Next Story